ఏపీ ఐటి శాఖామంత్రి కేటీఆర్ రోజుకో కొత్త స్టేట్ మెంట్ తో జనంలోకి దూసుకుపోవాలని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు 2019 నాటికి లక్ష ఉద్యోగాలు ఐటి రంగంలో కల్పనే తన లక్ష్యం అని లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు. ఆ సంఖ్యను ఇప్పుడు ఒక్కసారిగా రెండులక్షల ఉద్యోగాలుగా టార్గెట్ పెంచేశారు. గన్నవరం లో మేధా టవర్స్ దగ్గర అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ కూడా లక్ష ఉద్యోగాలే తన లక్ష్యం అని లోకేష్ చెప్పారు. 24 గంటలు గడవకుండానే లోకేష్ తాజాగా మంగళగిరిలో ఐటి భవన సముదాయానికి శంఖుస్థాపన సభలో రెండు లక్షల ఉద్యోగాలు 2019 లోగా ఏర్పరుస్తామన్నారు.
చినబాబు తీరు మారాలంటున్న నెటిజెన్స్ ...
ఇక చినబాబు లోకేష్ పై సోషల్ మీడియా లో సెటైర్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి. ఆయన ఏమి మాట్లాడినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతుంది. ఒక్క రోజులో లక్ష ఉద్యోగాల పెంచేశారా ? మిమల్ని అమెరికా వారు సీక్రెట్స్ చెప్పమని కోరతారేమో ? చినబాబా మాజాకానా అంటూ అబద్ధాల్లో అసత్యాల్లో తండ్రిని మించిన తనయుడు అంటూ ఇలా ఐటి మంత్రిని నెటిజెన్స్ ఆడుకుంటున్నారు. లోకేష్ తాజా ప్రకటనపై టిడిపి వర్గాలు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. సన్ రైజ్ ఏపీలో భాగంగా దీర్ఘ కాల ఆలోచనలతో నిరుద్యోగుల కోసం చినబాబు కృషి చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొదట్లో చినబాబు ప్రసంగాల్లో తప్పులు దొర్లేవని కానీ ఇప్పుడు ఆయన మెరుగుపడ్డారన్నది తమ్ముళ్ళ వాదన.