లోకేష్ కు యువకుడు ఛాలెంజ్

Update: 2017-10-25 07:30 GMT

టీడీపీ సర్కార్ కు ఒక యువకుడు వేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందని ఉదయ్ కిరణ్ అనే యువకుడు రాసిన లేఖ సంచలనంగా మారింది. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని ఉదయ్ కిరణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఏపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా ఇస్తున్న హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని చెప్పారు. గత ఎన్నికల్లో తాము టీడీపీకే ఓటు వేశామనికూడా చెప్పుకొచ్చారు. అయినా ఇన్నాళ్లూ హామీలు నెరవేరుస్తారేమోనని వేచిచూశామని ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలం గడిపేస్తున్నారని దుయ్యబట్టారు.

అంతా కనికట్టే...

రాష్ట్రాభివృద్ధి మొత్తం కనికట్టు అని ఉదయ్ కిరణ్ తన లేఖలో పేర్కొన్నాడు. విషం చిమ్మే ఆక్వా ఫ్యాక్టరీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నించారు. ఉదయాన్నే లేగదూడల శబ్దం వినే తమకు పోలీసుల బూట్ల చప్పుడు వినాల్సి వస్తుందని ఆవేదన చెందారు. మూడేళ్లలో ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయో... ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని మించిన తెలివైన వారు ఎవ్వరూ లేరు అనుకోవద్దని, కాగితాల మీదనే అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మీకు ప్రత్యామ్నాయం తీసుకురావడం ప్రజలకు చిటికేసినంత పని అని ఛాలెంజ్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా యువకుడు ఉదయ కిరణ్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Similar News