;జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోకేష్ అవినీతిని ఎండగట్టారు. బహిరంగంగా విమర్శలు చేశారు. అసెంబ్లీ లో కూర్చుని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారని, గుంటూరులో కలరా వచ్చి చచ్చిపోతే మీకు బాధలేదా? శ్రీకాకుళంలో పసిపిల్లలు చనిపోతుంటే బాధ కలగలేదా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలంటే తమకు ఓటెయ్యాలని మోడీ ఆనాడు చెప్పారని, అయితే ఇప్పుడు స్కామ్ ఆంధ్రా చేయలేదు కాని కరప్షన్ ఆంధ్ర చేశారన్నారు. లోకేష్ పెద్ద అవినీతిపరుడన్నారు. లోకేష్ అవినీతి చంద్రబాబు దృష్టికివచ్చిందో లేదో తెలియదన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమతో కలిసి ఉంటాడో లేదో తెలియదు కాని జగన్ ను ఎదుర్కొనాలంటే అవినీతి చేయక తప్పదని టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారన్నారు. ఎన్టీఆర్ మనువడు ఏంచేస్తున్నాడో మీకు తెలుసా? ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఒక్కొక్కఅసెంబ్లీ నియోజకవర్గానికి కోట్లు ఖర్చు చేద్దామనుకుంటున్నారు. ఏపీ కరప్షన్ లో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రికి పార్టీ మీద, అధికారుల మీద పట్టులేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎవరినీ చంద్రబాబు సర్కార్ సంతృప్తి పర్చలేదన్నారు.