లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు జైలులో ఏం చేస్తున్నారు. తోటమాలి పనిచేస్తూ సరదాగా గడిపేస్తున్నారా? అయితే లాలూ యాదవ్ సంక్రాంతి సంబురాలను జైల్లో ఎలా చేసుకుంటున్నారు? తోటి ఖైదీల మధ్య లాలూ కవితలు వినిపిస్తూ జైలులో ఖుషీఖుషీగా ఉన్నారట. అంతేకాదు సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ వంటకం దహీ చుడాను కూడా లాలూ జైలులో రుచి చూశారు. లాలూ యాదవ్ ఇటీవల న్యాయస్థానంలో కూడా జడ్జిని అభ్యర్థించారు.
దహీ చుడా అంటే....
తనకు ఆరోగ్యసమస్యలున్నాయని, శిక్ష కొంత తగ్గించాలని కోరారు. అంతేకాదు సంక్రాంతికి తాను దహీ చుడాను కూడా తినలేనని న్యాయమూర్తి ముందే వాపోయారు. అయితే అందుకు న్యాయమూర్తి దహీ చుడాను తాను జైలుకు పంపుతానని వ్యాఖ్యానించారు. అయితే ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా లాలూకు ఆర్జేడీ నేతలు దహీ చుడాను తీసుకొచ్చి లాలూకు అందించారు. గత సంక్రాంతి వేడుకలకు లాలూ, నితీష్ కుమార్ లు ఇద్దరూ కలిసి సంక్రాంతి వేడుకలను ఒకే వేదికపై జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదే వేదికపై దహీచుడాను ఇద్దరూ తిన్నారు.
పెద్దయెత్తున తరలి వచ్చిన...
కాని ఈసారి మాత్రం ఇద్దరూ విడిపోయారు. లాలూ పార్టీని వదిలించుకుని నితీష్ కమలం గూటికి చేరిపోయారు. లాలూ మాత్రం పశుగ్రాసం కుంభకోణంలో బిర్సాముండా జైలులో ఉన్నారు. మరో మూడున్నరేళ్లు లాలూ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈరోజు సంక్రాంతి సందర్భంగా లాలూకు దహీ చుడాను ఆయన అభిమానులు తీసుకురావడంతో ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. లాలూను పలకరించేందుకు పెద్దయెత్తున అనుచరులు తరలి వచ్చారు. ఆయనకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారి ముందే కడుపారా ఆరగించారు. త్వరలో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో లాలూ యాదవ్ సవాల్ చేయనున్నారు.