వైసీపీ ఎమ్మెల్యే రోజా తన తాతయ్య ఊరిలో పార్టీ అధినేత జగన్ కు హార్థిక స్వాగతం పలికారు. ఆర్కే రోజా తాతయ్య గ్రామం చింతపర్తి. ఇది పీలేరు నియోజకవర్గంలో ఉంటుంది. చిన్నప్పుడు రోజా ఇదే గ్రామంలో చదువుకోవడంతో ఆ గ్రామంతో రోజాకు అనుబంధం ఉంది. చిన్న నాటి స్నేహితులతో పాటు బంధువులు కూడా చింతపర్తిలో ఎక్కువ మంది ఉన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు తాతయ్య ఊరు వస్తున్నాడని తెలుసుకున్న రోజా ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. పీలేరు నుంచే రోజా టీడీపీలో ఉన్నప్పుడు పోటీ చేయారనుకున్నారు కూడా. అటువంటి గ్రామానికి వచ్చిన జగన్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
నేటి పాదయాత్ర ఇలా....
జగన్ ఇప్పటికి 720 కిలోమీటర్ల మేర నడిచారు. కలికిరిలో రాత్రి బస చేసిన జగన్ నేడు 52వ రోజు ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారు. ఈరోజు పీలేరు నియోజకవర్గం కలికిరి నుంచి అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్ రోడ్స్, కరెవండ్లపల్లి క్రాస్ రోడ్స్, ఉటుపల్లి క్రాస్ రోడ్స్, మిట్టపల్లి, పెద్దూరు, చెరువుముందరిపల్లి, చెనకవారి పల్లి మీదుగా ప్రజాసంకల్ప యాత్ర జరుగుతుంది. ఈరోజు రాత్రిక కురవపల్లి వద్ద జగన్ రాత్రికి బస చేస్తారు. చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర మంచి స్పందన లభిస్తోంది. చింతపర్తి చిన్న గ్రామమైనా వేలాది మంది ప్రజలు తరలి రావడంతో జగన్ ఆనందంతో తబ్బిబ్బుయ్యారు.