సినీ నటుల ఇళ్లల్లో చోరీ లు జరుగుతున్నాయి.. సినిమా యాక్టర్ ఇళ్లల్లో సెక్యూరిటి లేకుండా పొతుంది. నటీనటులు ఎక్కువగా బయట తిరుగుతుంటారు. ఇలా తిరుగుతున్న సమయంలో వారి ఇంట్లో దొంగలు పడి దొచుకుని పొతున్నారు. నటి, ఎమ్మెల్యే రోజా ఇంట్లో దొంగలు పడ్డారు. పది రోజులుగా రోజా ఇంట్లో లేని సమయంలో ఈ చొరీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాయదుర్గం పరిధిలోని మణికొండలోని పంచవటి కాలనీలో రోజా తనకుటుంబంతో కలిసి వుంటున్నారు. గత పది రోజుల నుంచి రోజా కుటుంబం ఇంట్లో లేదు. ఇంటికి సంబంధించిన తాళాలు వాచ్ మెన్ కు ఇచ్చి వెళ్లారు. రోజా ప్రస్తుతం జగన్ పాదయాత్రలో వున్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న జగన్ తో కలిసి పర్యటన చేస్తున్నారు. భర్త కూడా షూటింగ్ లో బిజిగా వుండి ఇంట్లో లేరు. పది రోజుల నుంచి రోజా ఇల్లు ఖాళీగా వుంది. నిన్న ఉదయం రోజా భర్త ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత బీరువాలో వుండాల్సిన నగదు, వజ్రాల హారం, వెండి వస్తువులు కనిపించ లేదు. దీంతో వెంటనే రోజా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ఆరంభించారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషులే ఈ చోరీ చేసి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే రోజా ఇంట్లో చోరీకి గురైన వస్తువులు విలువ దాదాపుగా పది లక్షలకు పైగా వుంటుందని పోలీసులు చెబుతున్నారు. పనిమనుషులే ఈ చోరీచేసి వుంటారన్న కోణంలో పోలీసులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ ఆరంభించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా ఇంట్లోని సిబ్బందే రెండు లక్షలు చోరీ చేసిన సంగతి తెలిసిందే.