రేవంత్ వెంట సీతక్క

Update: 2017-10-30 06:30 GMT

టీడీపీ సీనియర్ నేత, ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క తన దారి తానుచూసుకోనున్నారు. సీతక్క కూడా రేవంత్ వెంట వెళ్లే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. సీతక్క రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ పటిష్టత కోసం ప్రయత్నం చేశారు. అధికార టీఆర్ఎస్ పాలనపై సీతక్క విరుచుకుపడేవారు. మావోయిస్టు నేపథ్యం నుంచి వచ్చిన సీతక్క ములుగు నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా తొలుత ఎన్నికయ్యారు. సీతక్క ప్రజాసమస్యపై స్పందించేతీరుపై చంద్రబాబు కూడా అనేకసార్లు ప్రశంసలు అందించారు. అలాంటి సీతక్క రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈరోజో, రేపో టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి సీతక్క రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.

వరంగల్ దాదాపు ఖాళీ.....

మరోవైపు సీతక్క కాంగ్రెస్ లోకి వెళితే ములుగు టిక్కెట్ పై కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందా? లేదా? అన్నది తెలియరాలేదు. ఎందుకంటే ఇప్పటికే ములుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్ తరుపున ఆ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరి రేవంత్ పెట్టిన షరతుల్లో ములుగు నియోజకవర్గం కూడా ఒకటుందని సమాచారం. అలాగే వరంగల్ జిల్లాలోనే టీటీడీపీకి ఎక్కువ డ్యామేజీ జరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రేవూరి ప్రకాశరెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. వీరందరూ పార్టీని వీడితో వరంగల్ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్లే. ఇక రేవంత్ వెంట సోయం బాపూరావు, అరికెల నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

Similar News