రేవంత్ రెడ్డి రాజీనామా లేఖలో్ పలు విషయాలను ప్రస్తావించారు. పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. తనను చంద్రబాబు ఇంతటి వారిని చశారని, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ, చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. తాను తెలంగాణలో టీడీపీ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కాని కొందరు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. తాను కేసీఆర్, టీఆర్ఎస్ లక్ష్యంగా పోరాడుతుంటే కొందరు నేతలు వారితో అంటకాగుతున్నారని ఆవేదన చెందారు. ముఖ్యంగా ఏపీ నేతలు, తెలంగాణ లోని టీడీపీ నేతలు టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు పెట్టుకుని తన లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇప్పటి వరకూ పార్టీ తనకు ఇచ్చిన గౌరవానికి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. కాగా రేవంత్ కొడంగల్ లోని తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.