రేవంత్ ఫ్లెక్సీ కలకలం

Update: 2017-10-21 06:30 GMT

రేవంత్ రెడ్డి ఒకవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరై .... టీడీఎల్పీ సమావేశాన్ని కూడా ఆయన 24న నిర్వహించబోతున్నారు. టీడీపీ నేతలు మాత్రం రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. అధినేతకు చెప్పకుండా కాంగ్రెస్ నేతలను ఎలాకలిశారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ విషయాన్ని అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తేలుస్తారని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. రేవంత్ మాత్రం కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నేతలకు తాను ఎందుకు పార్టీలో చేరుతున్న విషయాన్ని తెలియజెబుతున్నారు.

రాజీనామా చేయకుండానే....

ఇదిలా ఉండగా... రేవంత్ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే ఇప్పుడు ఉన్నారు. టీడీఎల్పీ నేతగానూ కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు. కాని కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై రేవంత్ రెడ్డి ఫొటోను ముద్రించారు. వరంగల్ నగరంలో హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వచ్చే మార్గంలో ఈ ఫ్లెక్సీని డీసీసీబీ మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అనుచరులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ పార్టీలో చేరకముందే కాంగ్రెస్ నేతలు తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News