రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటంలేదు. పార్టీమారుతున్నవిషయంపై ఇప్పటివరకూరేవంత్ ఎలాంటిక్లారిటీ ఇవ్వలేదు. పార్టీ మారుతున్నాడా?లేదా? అన్న విషయాన్నిఆయనఎవరికీచెప్పడం లేదు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని రేవంత్ చెబుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ నేతలతో రేవంత్ టచ్ లో ఉంటున్నారు. తనపై చంద్రబాబు చర్యలు తీసుకునేంత వరకూ ఆయన వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. రేవంత్ గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన రాహుల్ ను కలిసి నట్లు కూడా చెబుతున్నారు. అయితే రేవంత్ కాంగ్రెస్ నేతలను కలిస్తే తప్పేంటి? అని మాత్రమే ప్రశ్నించారు. తప్ప తాను రాహుల్ ను కలవలేదని ఎక్కడా చెప్పలేదు. తాను బయటపడితే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకునే వీలుంది. అందుకనే తాను బయటపడకుండానే అధినేతచంద్రబాబు తనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు.
రేపు టీడీఎల్పీసమావేశం.....
మరోవైపు ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం టీడీఎల్పీ సమావేశాన్ని రేవంత్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యేలకు, టీటీడీపీ నేతలకు రేవంత్ ఆహ్వానం పంపారు. అయితే రేవంత్ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకాకూడదని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య లకు కూడా అధిష్టానం నుంచి ఆ సమావేశానికి వెళ్లొద్దని ఆదేశాలు అందాయి. దీంతో రేవంత్ ఒక్కరే టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. రేవంత్ ను ఒంటరిగా చేసి ఆయన తనంతట తాను పార్టీని వీడేలా చూడాలని పార్టీ హైకమాండ్ భావిస్తుండగా, రేవంత్ మాత్రం తనపై చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తుండటం విశేషం. అయితే విదేశాల్లో ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రేవంత్ పార్టీని వీడుతున్నదానిపైన వివరణ ఇవ్వకుండానే టీడీఎల్పీ సమావేశం నిర్వహించడమేంటని చెప్పారు. దీంతో చంద్రబాబు డైరెక్షన్ లో రేపు టీటీడీపీ నేతలు బీజేపీ నేతలతో కలిసి శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు రేపు బీజేపీ శాసనసభ పక్షం హాలులోనే టీటీడీపీ నేతలు కూడా పాల్గొంటారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు.