వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మాజీ టిటిడిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెగ నచ్చేశాడు. రేవంత్ టిడిపి కి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరడం పట్ల రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా పోస్ట్ లో వర్మ రేవంత్ పై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక ఫిలిం మేకింగ్ ధియేటర్ అయితే ... బాహుబలి నోట్ల వర్షం కురిపిస్తే ... రేవంత్ ఓట్ల వర్షం కురిపిస్తారని వర్మ వ్యాఖ్యానించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకు ఎక్కిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం సృష్ట్టించిన వర్మ ఈ వ్యాఖ్యలు చేయడానికి చాలా కారణాలే వున్నాయి.
డ్రగ్స్ కేసు ప్రధాన కారణం ...
తెలంగాణ లోని ఫిలిం ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసుపై వర్మ గతంలోనే సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నాడు టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి ఒక రేంజ్ లో దాడి చేశారు. తాజాగా అసెంబ్లీ పాయింట్ లో తన పదవికి రాజీనామా చేసే ముందు రేవంత్ కేటీఆర్ కి సైతం సవాల్ విసిరారు. దమ్ముంటే రక్త నమూనాలు , వెంట్రుకలు , గోళ్లు కేటీఆర్ ఇవ్వాలని ఆయన ఇస్తే తానూ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. రేవంత్ భావోద్వేగ ప్రసంగాలకు రాము ఆకర్షితుడు కావడంతో ఆయన పార్టీ మారుతున్న సందర్భంలో మరింత జోష్ చేకూరేలా వ్యాఖ్యలు చేసినట్లు టాక్ నడుస్తుంది. ఎప్పుడు ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారో ఆయనకే తెలియని రాము కి ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో ఈ అంశం బాగా నచ్చడంతో రేవంత్ పై ప్రశంసలు జల్లు కురిపించడం విశేషం.