తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గతంలో ప్రస్తుతం సాగిస్తున్న పర్యటనలు ప్రభుత్వాల భజన కోసమే అన్న విమర్శలు వెల్లువెత్తడం తో జనసేనాని అనంతపురం లో రూట్ మార్చారు. ఏపీ ప్రభుత్వం పై ప్రశంసలు కానీ విమర్శలు కానీ లేకుండా పవన్ తన ప్రసంగం సాగించారు. తనపై తన స్ట్రేటజీపై వస్తున్న విమర్శలు పట్టించుకోనని అంటూనే ఆయన నేరుగా సమస్యల పరిష్కారం జనంలోకి వెళ్ళి నేరుగా మాట్లాడే కార్యక్రమాలకు పరిమితం అవుతారని ఆయన శైలి తెలియచేస్తుంది. అనంతపురం జిల్లా గుత్తిలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పికె తరువాత జరిగిన సభలో తన ప్రసంగానికి తక్కువ సమయమే కేటాయించారు.
కేంద్రాన్ని టార్గెట్ చేయని పవన్ ...
తెలుగు రాష్ట్రాల్లో టిడిపి సర్కార్ ఎన్డీయేలో భాగస్వామి గా ఉండగా వైసిపి కూడా బిజెపికి అన్నిటా సహకరిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెబుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ కి ఎదురు వెళ్లడం మంచిది కాదన్న రీతిలోనే జనసేన స్టాండ్ సవరించుకుంది. గతంలో హోదా పై కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆధోరణి పూర్తిగా వదిలేసినట్లే కనిపిస్తుంది. తాజా జగన్ ప్రసంగంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ప్రస్తావించలేదు. సరికదా ఇక్కడ రైతులు, నీటిపారుదల నిపుణులతో, చేనేతలు ఇతర అన్ని వర్గాలతో కలిసి చర్చించి అనంతపురం కరువు సమస్యకు పరిష్కారం ఆలోచిద్దామని ప్రకటించారు.
ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళదామన్న పవన్ ...
ఏపీలో ముఖ్యంగా రాయలసీమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త ఉద్యమానికి జనసేనాని సిద్ధం అయ్యారు. రైతులు, నీటిపారుదల నిపుణులతో త్వరలో పవన్ రైలు ఢిల్లీ బయల్దేరుతుంది ప్రకటించారు. ప్రధాని మోడీ తో సమావేశం అయ్యి పరిష్కారాలకు కృషి చేస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో బిజెపి విజయానికి కృషి చేసిన తాను వారి నుంచి టీ కూడా ఆశించలేదని ప్రజల కోసం ఇప్పుడు కేంద్రంతో చర్చిస్తా అన్నారు. సమస్యల కోసం రోడ్లు ఎక్కకండి. వాటిపై పోరాటానికి పాతికేళ్లవరకు పోరాటానికి సిద్ధమై వున్నా అంటూ ప్రకటించారు. తన మార్గం ప్రజా సమస్యల పరిష్కారమని ఎవరికో వ్యతిరేకమో అనుకూలమో కాదని తేల్చారు పవర్ స్టార్. అలా తనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలనుంచి వెల్లువెత్తిన విమర్శలకు సమాధానం చెప్పుకున్నారు పవన్. తెలంగాణ పర్యటన తరువాత ఏపీలో పికె మాటల్లో వేడి తగ్గించడం ఆయన లెక్కల్లో వ్యూహాత్మకమే కావొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.