రాహుల్ కు శివసేన ఛీర్స్

Update: 2017-12-18 06:32 GMT

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన పొగడ్తల వర్షం కురిపించింది. గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ పోరాటం అద్భుతమని శివసేన పేర్కొంది. ఎన్నికల్లో బీజేపీ గెలిచినా నైతికంగా కాంగ్రెస్ దేగెలుపని తెలిపింది. గెలుపు గురించి పట్టించుకోవద్దని, ప్రధాని మోడీపై చేసిన పోరాటం ఉధృతం చేయాలని శివసేన అధికార పత్రిక సామ్నాలో అభిప్రాయపడింది. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన పదవిని చేపట్టారని, బాధ్యతలను సక్రమంగా రాహుల్ నిర్వర్తించగలరని ఆ పత్రిక సంపాదకీయంలో పేర్కొనడం విశేషం. రాహుల్ కు శుభాకాంక్షలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మోడీని ఎదుర్కొన్న రాహుల్ సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పగలనన్నారు. ఆ విశ్వాసంతోనే రాహుల్ ముందుకెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

Similar News