రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆయనకు పెద్ద శుభవార్తను అందించింది. రాహుల్ ను సహజంగా పప్పు అని కాంగ్రెస్ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. రాహుల్ పై చేసే ప్రతి కామెంట్ కు పప్పు అని జత చేయాల్సిందే. ఇలా చేసే కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పదవులను పోగొట్టుకోవడమే కాకుండా సస్పెండ్ కూడా అయ్యారు. ఇక బీజేపీ నేతలయితే చెప్పనక్కర లేదు. రాహుల్ పై ఎప్పుడు విమర్శలు చేసినా ‘పప్పు’ అనే పదాన్ని వదలిపెట్టరు. రాహుల్ ను సమర్ధిస్తున్న నేతలు కూడా ఆయన పప్పు కాదు గట్టి మనిషేనని అంటుంటారు. అంటే సమర్థించే నేతలు కూడా పప్పు అనే పదాన్ని వదిలిపెట్టడం లేదు. శివసేన నేతలు కూడా ఇలానే కామెంట్స్ చేశారు.
‘పప్పు’ పదంపై ఈసీ నిషేధం....
ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ జోరుగా పాల్గొంటున్నారు. ఎలాగైనా గుజరాత్ ఎన్నికల్లో గెలవాలని రాహుల్ విపరీతంగా శ్రమిస్తున్నారు. కొంత వరకూ సక్సెస్ కాగలిగారు. అయితే ఇటీవల ీజేపీ నేతలు రాహుల్ ను ఉద్దేశించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రకటనలో పప్పు అనే పదాన్ని వినియోగించింది. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ‘పప్పు’ అనే పదం అభ్యంతరకరంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ పదంపై నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ఈ పదాన్ని వినియోగించకూడదని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో రాహుల్ కు ఊరట లభించినట్లయింది. అయితే ఎన్నికల కమిషన్ వద్ద మాత్రం బీజేపీ నేతలు ప్రకటనలో ఉద్దేశించి రాసిన ఆ పదం ఏ నేతను ఉద్దేశించి చేసింది కాదని పేర్కొంది. అయినా ఎన్నికల కమిషన్ మాత్రం పప్పు అనే పదంపై నిషేధం విధించింది.