రాజ్యసభలో రచ్చ...రచ్చ ...!

Update: 2018-01-04 01:51 GMT

లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభ కు చేరుకున్న ట్రిపుల్ తలాక్ అంశం అక్కడ వేడి వేడి చర్చకు తెరతీసింది. విపక్షాలు బిల్లులు లో సవరణలకు మోడీ సర్కార్ పై ముప్పేట దాడికి దిగాయి. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్ అధికారపక్షం నడుమ తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం పెద్దల సభలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పక్షాన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ సభలో చేసిన వ్యాఖ్యలు బిజెపి సర్కార్ ను ఇరుకున పెట్టాయి. రెండు ప్రధాన పక్షాలు సాగించిన మాటల యుద్ధం సభా నిబంధనల అంశాలు , కోర్ట్ తీర్పు అంశాలు స్పీకర్ ను సైతం అచేతనుడిగా మార్చాయి.

సెలెక్ట్ కమిటీ ముందుకు బిల్లు ...

రాజ్యసభలో మోడీ సర్కార్ కి తగిన బలం లేకపోవడంతో బిల్లు సెలక్ట్ కమిటీ కి నివేదించాలని ప్రభుత్వం భావించింది. బిజెపి సర్కార్ పక్షాన అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ముస్లిం మహిళల హక్కులపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో లేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ కి పట్టుపట్టినా ఛైర్మన్ నిరాకరించడంతో అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. లోక్ సభలో బిల్లుపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బందికి గురిచేయని కాంగ్రెస్ మైనారిటీ ఓటర్ల మనోగతాన్ని గమనించి రాజ్యసభలో పోరాటం ప్రారంభించడం గమనార్హం.

Similar News