రమాదేవి (18) అనే మహిళ మగ వేషం ధరించి ముగ్గురు మహిళ లను మోసం చేసి వివాహం చేసుకున్న సంఘటన కడపజిల్లాలోని జమ్మలమడుగు లో జరిగింది .వివరాల్లోకి వెళితే కాశి నయన మండలంలోని ఇటికలపాడు గ్రామానికి చెందిన రమాదేవి తమిళనాడు రాష్ట్రంలోని రోహిణి మిల్ లో ఉద్యోగం చేస్తు జీవనం కొనసాగిస్తోంది.అయితే రమాదేవి మగవేషం వేసుకుని ముగ్గరమ్మాయిలను వివాహం చేసుకుంది .మొదట ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బుజ్జి(16) అనే అమ్మాయిని వివాహం చేసుకుంది.రెండోది అనంత జిల్లాలోని ముదిగుబ్బ మండలం లోని కోత్త చెరువు గ్రామానికి చెందిన వందన (17) అనే అమ్మాయిని వివాహం ఆడింది.మూడవది రెండు మూడు నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన నిర్మల(17)ను వివాహం చేసుకుంది .వివాహం అయిన వెంటనే తనకు సెలవులు లేవని త్వరలో సంసారం అక్కడే పెడతాను అని వెళ్లడం తరువాత పత్తా లేకుండా ఇంకొకరిని వివాహం అడటం అలవాటుగా చేసుకుంది .అయితే నిర్మల పెళ్ళి అయిన కొన్నిరోజులకు రమాదేవి మోసాన్ని పసిగట్టి పక్కా ప్రణాళికతో రామాదేవిని పట్టుకొని జమ్మలమడుగు లోని పోలీసుస్టేషన్ లో పట్టించింది.దీనితో పోలీసులు విచారణ చేయడంతో రమాదేవి మగవాడి వేషం లో చేసుకున్న పెళ్ళిళ్ళగురించి బయటపడింది .నిర్మల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.