జగన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ఈరోజు సాయంత్రం జరగనున్న క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖకు సాయంత్రం 4గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే పోలీసులు జగన్ ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించడంతో జగన్ రన్ వే పైనే బైఠాయించారు. శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలపాలని జగన్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు జగన్ తో చర్చలు జరుపుతున్నారు. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబుతో పాటు మరో నలుగురు నేతలున్నారు. వీరంతా విశాఖ ఎయిర్ పోర్టు రన్ వేపైనే బైఠాయించడంతో పోలీసులకు ఏమి చేయాలో తెలియక ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ మొత్తం పోలీసులే కన్పిస్తున్నారు.