రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీకి వచ్చే సరికి ప్రస్తుతం ఉన్న బలాబలాను బట్టి చూస్తే రెండు స్థానాలు అధికార టీడీపీకి, ఒక్క సీటు విపక్ష వైసీపీకి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార టీడీపీ మరింత స్పీడప్ చేసి మరో ఇద్దరు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పేసుకుంటే ఆ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడడం ఖాయం.
బీసీ కోటాలో....
ఇక టీడీపీ నుంచి ఎవరు రాజ్యసభకు వెళతారని వస్తోన్న వార్తలను బట్టి గత ఆరేడు నెలలుగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేరు బీసీ కోటాలో ప్రముఖంగా వినిపిస్తోంది. యనమల రాజ్యసభకు వెళ్లేందుకే ఆసక్తి ఉన్నారని ఒకటి రెండుసార్లు నర్మగర్భంగా చెప్పడంతో ఆయన పేరు బీసీ కోటాలో ఫైనలైజ్ అయినట్టే అన్న నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం యనమల రాజ్యసభకు వెళ్లేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
కేంద్రమంత్రి అవ్వాలని....
ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటోన్న యనమల రాజ్యసభకు వెళ్లి కేంద్రమంత్రి అవ్వాలని కోరికతో ఉన్నట్టు టాక్. అయితే ఇప్పుడు ఇక్కడ మంచి పోజిషన్ వదులుకుని రాజ్యసభకు వెళ్లినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుందో ? లేదో ? తెలియని పరిస్థితి. ఉన్నా యనమలకే కేంద్ర మంత్రి పదవి వస్తుందా ? లేదా అప్పుడు సమీకరణలు ఎలా ఉంటాయో ? అన్న సందేహం ఆయన్ను బాగా పీకేస్తోందట. దీంతో స్టేట్‌లో కీలకమైన ఆర్థికమంత్రి ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి పదవికి కోసం ఇప్పుడే రిస్క్ చేయడం కరెక్ట్ కాదని ఆయన యూ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
వారసురాలి ఎంట్రీకి.....
ఇక తన సొంత నియోజకవర్గం తునిలో యనమల ఫ్యామిలీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ గత రెండు ఎన్నికల్లోనూ యనమల, ఆయన సోదరుడు ఓడిపోతున్నారు. ఇక తన తర్వాత తన కుమార్తెను తన వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు యనమల ట్రై చేస్తున్నారు. ఇప్పుడు తాను రాజ్యసభకు వెళ్లిపోతే స్టేట్ పాలిటిక్స్‌లో తనకు పట్టు తగ్గుతుందన్న సందేహం కూడా యనమలకు ఉన్నట్టే జిల్లాలో పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్నాకే యనమల చివరకు రాజ్యసభకు వెళ్లకపోవడమే బెటర్ అన్న డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన క్లారిటీకి వచ్చేసినట్టే అన్నది ఫైనల్‌గా వినిపిస్తోన్న మాట.