యూపీలో ఓటుంటే లక్కీఫెలోనే

Update: 2017-01-22 09:03 GMT

ఉత్తరప్రదేశ్ లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని సమాజ్ వాదీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అన్ని రంగాలనూఆకట్టుకునే విధంగా తన మేనిఫేస్టోకు రూపకల్పన చేశారు సీఎం అఖిలేష్. ఉచితంగా స్మార్ట్ ఫోన్ యోజన పథకం ద్వారా స్మార్ట్ ఫోన్లు ఇస్తారు. మహిళలకు ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తారు. పేదపిల్లలకు నెలకు కిలో నెయ్యి, కిలో పాలపొడి పంపిణీ చేస్తారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా కౌశల్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు అఖిలేష్ మేనిఫేస్టోలో పెట్టారు. కార్మికులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. నగరాలతో పాటు పల్లెలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరాను చేస్తామన్నారు. ఆగ్రా, కాన్పూరు, వారణాసిల్లో మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. మనుషుల కోసం ఉన్నట్లుగానే ప్రమాదంలో, రోగాల బారిన పడిన పశువుల కోసం 108 నెంబరుతో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

Similar News