యువతులు కిక్కెక్కి పోలీసులకు చుక్కలు...చూపిస్తూ...!

Update: 2018-01-18 02:44 GMT

అభివృద్ది లో ,ఉద్యోగాల్లో మగవాళ్ళతో పోటీపడుతున్న మహిళలు.. మరో విషయంలో కూడా మగవారితో పోటీపడుతున్నారు. మగవాళ్లకు ఆడవాళ్లు ఏ విషయంలోను తక్కువ కాదని తరచూ కొంత మంది చెప్పే మాట .దీన్ని నిజం చేస్తున్నారు కొంత మంది మహిళలు.. ఇంతకీ దేనిగురించి అనుకుంటున్నారా ?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో....

తాగి బండి నడిపే వారిని కట్టడి చెయ్యడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. మొదట్లో చిన్నపాటి శిక్షలు, జరిమానాతో సరిపెట్టే వారు. ప్రస్తుతం జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తున్నారు. దీంతో తాగి నడపడానికి భయపడుతున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యింది. పురుషులు తాగి డ్రైవ్ చెయ్యడానికి భయపడుతుంటే మహిళలు మాత్రం రెచ్చిపోతున్నారు. తాగి నడపడమే కాదు పోలీసులతో గొడవ పడటం, వీడియో తీస్తున్న జర్నలిస్ట్ లను దూషిస్తు వీరంగం సృష్టిస్తున్నారు.

కల్చర్ మారడంతో....

ఇటీవల కాలంలో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ కల్చర్ మారుతుండటంతో మహిళలు కూడా డ్రింక్ కల్చర్ కు అలవాటుపడుతున్నారు. గతంలో కూడా మహిళలు తాగి వాహనాలు నడుపుతున్నా.. ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న యువతుల సంఖ్య ప్రతి డ్రైవ్ లోను పెరుగుతుండటం గమనార్హం. పురుషులు దొరికితే నాలుగు తగిలించి దారిలోకి తీసుకొస్తారు. అయితే మహిళలు మాత్రం తమను ఎలా ఆపుతారంటూ నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఈ మందు బేబీల బాధ తట్టుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే సమయంలో మహిళా పోలీసుల సహాయం తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

పోలీసులతో గొడవ....

ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోందని మహిళలను సైతం ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో మందు కొట్టి రోడెక్కే లేడీస్ జరభద్రం. .గత వారం రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యువాత పడిన తరువాత కూడా సంపన్నుల ప్రాంతంలో దీనిని పట్టించుకొవడం లేదు. బాగా చదువుకుని ,, బాగా డబ్నున్న ఒక యువతి రాత్రి చేసిన హల్ చల్ కు పోలీసులు నానా హైరానా పడ్డారు. పోలీసులకు చుక్కలు చూపెట్టిన ఈ సంపన్నల బిడ్డ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం రోజుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ను పెద్ద మొత్తంలో చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో పోలీసులు వుండరన్న భావనతో మధ్యరాత్రి సమయంలో తాగి రొడ్లు మీదకు వస్తున్నారు. అంతేగాకుండా పోలీసులకు సైతం చుక్కలు చూపెడుతున్నారు. ఇలాంటి కొవాలోకి చెందిన ఈ కేసుఒక్కటి జూబ్లిహిల్స్ లో జరిగింది.

ఫుల్లుగా తాడి పారిపోయి....

మద్యం తాగిన మైకంలో కారు నడుపుతూ హైదరాబాద్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగింది సుహాని అనే యువతి. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు చాలాసేపు వరకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపించింది. ఆల్కహాలు 61 పర్సంటేజ్ రావడంతో కేసు బుక్ చేస్తుండగా.. తప్పించుకుని పారిపోబోయింది. తన వాహనం వదిలి పెట్టి అక్కడి నుంచి వెళ్లిపొయింది. దీంతో తాగిన మత్తులో రొడ్డు మీద వెళ్లుతున్న ఈ యువతిని పట్టుకొవడానికి పోలీసులు నానా యాతన పడాల్సి వచ్చింది. ఈ సమయంలో పోలీసులు వద్ద లేడీ కానిస్టేబులు లేక పోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంబడించి మరీ తాగుబోతు యువతిని పట్టుకుని కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు.మహిళలను సైతం ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో మందు కొట్టి రోడెక్కే లేడీస్ జరభద్రం.

Similar News