యాంకర్ ప్రదీప్ కు ఆ కారు పోలీసులు ఇవ్వరా?

Update: 2018-01-18 02:24 GMT

మద్యం తాగి కారు నడిపి... ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన యాంకర్ ప్రదీప్ కారును ఇంకా పోలీసుల కస్టడీలోనే వుంది. సీజ్ చేసిన కారును పోలీసులు ఇంకా రిలీజ్ చేయలేదు. డిసెంబర్ 31 తేదిన తాగి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ యాంకర్ ప్రదీప్ పోలీసులు చిక్కాడు. అర్దరాత్రి సమయంలో పోలీసులు యాంకర్ ప్రదీప్ కారును సీజ్ చేశారు. ప్రదీప్ ను బ్రీత్ అన్ లైజర్ ద్వారా చెక్ చేయగా 178 పాయింట్లు వచ్చాయి. దీంతో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు . ఈ నెల8వ తేదిన ప్రదీప్ తండ్రితో కలిసి పోలీసుల ముందు కౌన్సిలింగ్ కు హాజరు అయ్యారు. అదే రొజున సీజ్ చేసిన కారును పోలీసులు తిరిగి ఇస్తారని ప్రదీప్ అనుకున్నారు. కాని కారును పోలీసులు రిలీజ్ చేయలేదు. దీంతో ఈ కారు పూర్తిగా పోలీస్ స్టేషన్ లో మట్టి కొట్టుకుని పోతుంది.

వంద పాయింట్లు లోపయితే....

అయితే 178 పాయింట్లు వచ్చిన నేపథ్యంలో సీజ్ చేసిన కారును కోర్టుకు అప్పగిస్తామని. కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని పోలీసులు చెప్పారు. దీంతో ఈ నెల 22 తేదిన తాను కోర్టు ముందు హాజరు కాబోతున్నట్లుగా ప్రదీప్ ఇప్పటికే చెప్పాడు. అదే రొజున కారును ప్రదీప్ కు ఇస్తారా.. లేదా? అన్న విషయం తెలుస్తుంది. పోలీసులు సీజ్ చేసిన కారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మట్టి కొట్టుకుని పొతుంది. 6666 ఈ కారు పూర్తి గా మట్టితో నిండిపొయింది. వంద లోపు పాయింట్లు వచ్చినట్లయితే కౌన్సిలింగ్ తర్వాత తాము కారును రిలిజ్ చేస్తామని.. అయితే ప్రదీప్ కు 178 పాయింట్లు రావడంతో తప్పనిసరి గా కోర్టు ముందు సీజ్ చేసిన కారును వుంచుతామని పోలీసులు వెల్గడించారు.

రెండు వేల కార్లు మట్టిలో...

ఇక పొతే డిసెంబర్ 31వ తేదీన మొత్తం 2200 మంది తాగి వాహనాలు నడిపిన వారు వున్నారు. ఇందులో ఎనిమిది వందల మంది మైనర్లులను పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మైనర్లు మొత్తం కూడా లగ్జీరీ కార్లలో ఉన్నారని పోలీసుల తెలిపారు. అందరికీ కూడా వందకు మించి పాయింట్లు వచ్చాయి. వీరిందరిని కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా రెండు వేల పై చిలుకు కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ఇప్పటి వరకు సగానికి పైగా కార్లను ఎవరూ తీసుకుని పొలేదు. ఈ కార్లలో చాల వరకు కూడా మట్టి పేరుకుపోయాయి. అన్నీ లగ్జీరీ కార్లు.. వీరిలో చాలా మంది కౌన్సిలింగ్ కు రాలేదని..ఇప్పటి వరకు కౌన్సిలింగ్ రాని ఎనిమిది మందికి తిరిగి నోటీసులు ఇస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ నోటీసులకు కూడా స్పందించక పొతే ఆరెస్టు వారెంట్లు జారీ చేస్తామని పోలీసులు చెప్పారు.

Similar News