యడ్యూరప్ప భావోద్వేగ ప్రసంగమిదే...!

Update: 2018-05-19 10:48 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన అసెంబ్లీలో భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో తాను పెద్దఎత్తున ప్రచారం చేశానని తెలిపారు. బీజేపీకి మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ధష్ట పరిపాలనను ప్రజలు తీరస్కరించారన్నారు. అయినా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అనుకోవడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా మాకు ప్రజాసేవ చేసే భాగ్యం లేకపోవడం బాధాకరమన్నారు. గత ఐదేళ్లుగా సిద్ధరామయ్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే పనులు చేయలేదని, మొండి నిర్ణయాలు తీసుకున్నారని, మోదీ చేసిన మంచి పనులు చూసే కర్ణాటక ప్రజలు తమకు 104 సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు మంచి చేద్దామనుకున్నానని తెలిపారు. సిద్ధరామయ్య ప్రజలను కన్నీళ్లు పెట్టించారని, ఆ కన్నీళ్లను తుడుద్దామనుకున్నానని పేర్కొన్నారు. లక్షన్నర లోపు రైతు రుణాలను మాఫీ చేద్దామనుకున్నానని తెలిపారు. కానీ నా ప్రయత్నం ఫలించలేదనన్నారు. ప్రతీ ఇంటి సమస్యనూ పరిష్కరిద్దామనుకున్నానన్నారు. తాను ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నానని ఆయన ఆవేదనతో చెప్పారు.

Similar News