మోదీ నియంత

Update: 2017-01-05 09:33 GMT

కరెన్సీ నోట్లు సామాన్యుల చేతికి వచ్చేసరికి నాలుగు నెలలుపైగా సమయం పడుతుందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకూ ఈ ర్యాలీ జరిగింది. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయిందని జైపాల్ అన్నారు. నియంతగా మోదీ వ్యవహరిస్తున్నారని...తాను అనుకున్నది చేయడమే కాని నిపుణుల నుంచి ఏమాత్రం సూచనలు తీసుకోకుండా నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రకటించారని జైపాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. వెంటనే ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని జైపాల్ డిమాండ్ చేశారు.

చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకూ సాగిన ర్యాలీలో పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశానికి దరిద్రపు ప్రధాని దాపురించారన్నారు. మోదీ తుగ్లక్ నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలకు కనువిప్పు కల్గించేందుకే ఈ ర్యాలీని నిర్వహించామని చెప్పారు.

Similar News