మోడీ హవా ఏమాత్రం తగ్గలేదే....!

Update: 2017-12-02 02:35 GMT

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు బీజేపీకి బూస్ట్ నిచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లకు, 198 మున్సిపాలిటీలకు, 438 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 14 కార్పొరేషన్లలో మేయర్ పదవిని కమలనాధులు కైవసం చేసుకున్నారు. ఇక మున్సిపాలిటీల్లో సయితం బీజేపీ తిరుగులేని ఆధిక్యతను కనబర్చింది. 67 స్థానాల్లో బీజేపీ, 45 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ, 28 స్థానాల్లో బీఎస్పీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేధీలో సయితం బీజేపీ జెండా ఎగుర వేయడం విశేషం. గుజరాత్ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు పార్టీకి శుభపరిణామమని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విస్తృతంగా ప్రచారం చేశారు. యోగీ పరిపాలనకు కూడా ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద నగరాల్లో మోడీ హవా తగ్గలేదన్నది మరోసారి రుజువైంది.

Similar News