మోడీ దేశాన్ని నాశనం చేస్తారన్న బీజేపీ నేత

Update: 2018-03-30 02:35 GMT

కర్ణాటక ఎన్నికల ప్రచారం బీజేపికి అచ్చొచ్చినట్లు లేదు. ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యడ్యూరప్ప అవినీతి ప్రభుత్వం అంటూ నోరు జారిన సంఘటన మరచి పోకముందే మరో తప్పు జరిగింది. అయితే ఈసారి అమిత్ షా సమక్షంలోనే మళ్లీ తప్పు జరిగింది. కర్ణాటకలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఆయన దేవనగరి జిల్లాలో జరిగిన సభలో ప్రసంగించారు. అమిత్ షా హిందీలో చేస్తున్న ప్రసంగాన్ని ఓ కన్నడ బీజేపీ నేత కన్నడంలో తర్జుమా చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీపై నమ్మకముంచి తిరిగి బీజేపీకే ఓటేయ్యండంటూ అమిత్ షా పిలుపు నిస్తే, దానికి అనువాదం చేస్తున్న కన్నడ బీజేపీ నేత దళితులకు ప్రధాని ఏమీ చేయరని, ఆయన దేశాన్ని నాశనం చేసేస్తారంటూ అనువాదించారు. ఈ ప్రసంగం ఇప్పుడు వైరల్ అయింది. ప్రచారంలో బీజేపీ పడుతున్న తడబాట్లు తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ అమితానంద పడుతోంది.

Similar News