మోడీ ఏపీని మరోసారి కవ్వించారా?

Update: 2018-02-21 13:47 GMT

బుందేల్ ఖండ్ కు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. బుందేల్ ఖండ్ కు 20 వేల కోట్ల ప్యాకేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. లఖ్ నవూలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మోడీ ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. బుందేల్ ఖండ్ కు ప్యాకేజీతో పాటు రక్షణ పారిశ్రామిక కారిడార్ ను కూడా మోడీ ప్రకటించారు. దీంతో ఏపీ నేతలు మండి పడుతున్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన మోడీ ఇక్కడకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా, బుందేల్ ఖండ్ కు ప్యాకేజీ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉందన్నది మోడీకి గుర్తుందా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మోడీ ప్రకటన కవ్వింపు చర్యగా తాము భావిస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ పట్ల కావాలని, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుందంటున్నారు. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో రక్షణ పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. అలాగే ఏపీ ఎప్పటి నుంచో రక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలను కాదని బుందేల్ ఖండ్ కు రక్షణ పారిశ్రామిక కారిడార్ ను ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Similar News