మోడీ ఎలా చేస్తే బాబు అలా చేసేస్తారా?

Update: 2017-12-24 13:30 GMT

ప‌సుపు పార్టీ కి క‌షాయం దండుకు దోస్తీ ఉంది గ‌నుక ఇప్పుడు మోడీ బాట‌లోనే ఏపీ వెళ్తుందా..! ఏమో ఎవ‌రికి తెల్సు అనొద్దు. అవ‌న్నీ లోగుట్టులో భాగంగా జ‌రిగేవే! గ‌త కొద్ది కాలంగా లేని పోని విష‌యాల‌పై చ‌ర్చ‌లు లేవ‌నెత్తి అస‌లైన స‌మ‌స్య‌ల్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే కెపాసిటీ ఒక్క మోడీకే ఉంద‌ని అనుకున్నా ఇప్పుడీ జాడ్యం చంద్ర‌బాబుకూ ప‌ట్టిందేమో అన్న‌ది ఇప్పుడు విన‌వ‌స్తోన్న విమ‌ర్శ‌. ఆల‌యాల్లో ఆంగ్ల సంవ‌త్స‌రాది వేడుక‌లు చేయ‌రాద‌ని దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనురాధ జీఓ ఇష్యూ చేయ‌డంపై ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేగుతోంది.గ‌త కొద్ది కాలంగా బాబు గారి ఇలాకా ఏనాడూ ఇలాంటి వివాదాలు రాలేదు. మ‌తాల వారీగా వారి వారి పండుగ‌ల సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు ఇస్తున్న కానుక‌లు , అదేవిధంగా ఎవ‌రూ అడ‌గకున్నా ఇచ్చేస్తున్న కొన్ని హామీలే ఇంత‌వ‌ర‌కూ విమ‌ర్శ‌ల పాల‌య్యాయి. తాజాగా ఏపీ స‌ర్కార్ తీసుకువ‌చ్చిన ఈ జీఓ పెను దుమార‌మే రేపుతోంది. ఇక దీనిపై టీడీపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలిక‌.

మైత్రి ఉన్నా లేకున్నా...

మోడీ చంద్ర‌బాబుల ఆంత‌ర్యం ఎవ్వ‌రికీ అంతుప‌ట్ట‌దు కీల‌క ప్రాజెక్టుల పూర్తిపై కానీ అడ్డ‌దారులు తొక్కుతున్న సంక్షేమం విష‌యంలో కానీ ఏమీ ప‌ట్ట‌ని చంద్ర‌బాబు అండ్ కో ఈ సారి మాత్రం సున్నిత‌మైన భావోద్వేగాల జోలికి పోయింది. కొత్త వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ఇప్ప‌టిదాకా ఈ ట్రెండ్ బీజేపీ మాత్ర‌మే వినిపించింది కానీ ఈ సారి ఎందుక‌నో చంద్ర‌బాబు స‌ర్కార్ దేవుళ్ల‌పై దృష్టి పెట్టి హాట్ టాపిక్ గా మారింది. కీల‌క వ్యాఖ్య‌లు చేసే స‌మ‌యంలో అయినా కాస్తో కూస్తో ముందూ వెనుకా చూడ‌క ఈ సారి ఇచ్చిన జీఓ తిరుమ‌ల దేవుడు మొదలుకొని విజ‌య‌వాడ దుర్గ‌మ్మ వ‌ర‌కూ అంద‌రూ ఎఫెక్ట్ అయ్యేలా ఉన్నారే! చూడాలి ఇప్ప‌టి గ్ర‌హ‌ణం ఎలా వీడ‌నుందో ..!!! అని!!

Similar News