మోడీ, ఇవాంకా టూర్ షెడ్యూల్ ఇదే....!

Update: 2017-11-24 03:17 GMT

భాగ్యనగరానికి మణిహారంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అదేరోజు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. మెట్రో ప్రారంభోత్సవ ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. మెట్రో రైలుకు అన్ని అనుమతులు వచ్చాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ప్రధాని మోదీ పర్యటన ఇలా....

28న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకుంటారు

బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్‌కు వెళతారు

మధ్యాహ్నం 2.30 గంటలకు మెట్రో రైలును ప్రారంభిస్తారు

అనంతరం మెట్రో రైలులో కూకట్‌పల్లి వరకు ప్రయాణిస్తారు

సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైటెక్స్‌కు చేరుకుంటారు

ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు

తర్వాత రోడ్డు మార్గంలో హైటెక్స్‌ నుంచి ఫలక్‌నుమా హోటల్‌కు చేరుకుంటారు

రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందులో మోదీ, ఇవాంకా పాల్గొంటారు

ఇవాంకా పర్యటన ఇలా....

28న హైదరాబాద్‌కు రానున్న ఇవాంకా ట్రంప్

28న సాయంత్రం 4 గంటలకు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు

తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందులో పాల్గొంటారు

రాత్రికి మాదాపూర్‌లోని హోటల్‌లో బస

29 మధ్యాహ్నం అమెరికాకు తిరుగు ప్రయాణం

Similar News