మోడీ ఇమేజ్ ఇంతగా డ్యామేజీ అయిందా.....?

Update: 2018-01-27 13:45 GMT

మోడీ ఇమేజ్ తగ్గింది కాని మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఎన్డీయే తిరిగి కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానుంది. ఈ విషయం లోక్ నీతి-సీఎస్ డిఎన్, ఏబీపీ సర్వేలో వెల్లడయింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే బలం తగ్గుతుందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ బలం పుంజుకోవడం గ్యారంటీ అని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఈ సర్వే నిర్వహించారు. ఈ తాజా సర్వేలో ఏన్డీయేకి గతంలో కంటే 30 సీట్లు తక్కువగా వచ్చే అవకాశముందని సర్వే తేల్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలుపుకుని 336 స్థానాలు వచ్చినట్లయింది. అయితే ఈ సంఖ్యలో 30 సీట్లు తగ్గే అవకాశముంది. అంతేకాకుండా ఐదు శాతం ఓట్ల శాతాన్ని కూడా బీజేపీ కోల్పోయే అవకాశముందని తేలింది.

రాహుల్ ను ఇష్టపడేవారి సంఖ్య....

అయితే ఈసర్వేలో తేలిన నిజమేంటంటే మిత్రపక్షాలతో కలుపుకునే ఈసారి బీజేపీ అధికారంలోకి రాగలదని, ఒంటరిగా గత ఎన్నికల్లో మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్సష్టమయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు గణనీయంగా పెరిగే అవకాశముంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం 44 స్థానాలే దక్కాయి. యూపీఏ మిత్రపక్షాలతో కలుపుకుంటే 59. ఈ సారి ఆ సంఖ్య 115నుంచి 127 వరకూ పెరగవచ్చని సర్వే చెప్పింది. మోడీ హవా గుజరాత్ ఎన్నికల తర్వాత తగ్గిందని సర్వేలో తేలింది. ఉత్తర భారతదేశంలో మోడీ సర్కార్ కు ప్రజాదరణ బాగానే ఉన్నా...దక్షిణ భారతదేశంలో మాత్రం తగ్గిందనే తేల్చింది. రాహుల్ కు ప్రజల్లో ఆదరణ గతంలో కంటే బాగా పెరిగింది. రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకునే వారి సంఖ్య 48 శాతం మందికి పెరిగింది. అలాడే మోడీ ప్రధానిగా అవ్వాలనుకునే వారు గత ఏడాది 44 శాతం మంది కోరుకోగా, ఈ సర్వేలో అది 37 శాతానికి పడిపోయింది. ఈ సర్వేను జనవరి 7వ తేదీ నుంచి 20 వరకూ 19 రాష్ట్రాల్లో 175 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించారు. మొత్తం 14,336 మంది అభిప్రాయాలు తీసుకోగా అందులో 51 శాతం మంది మోడీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 41 శాతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Similar News