వైసిపి అధినేత జగన్ తీవ్ర జ్వరం, జలుబు తో బాధపడుతున్నారు. తక్షణం పాదయాత్రకు విరామం ఇచ్చి కోలుకున్నాక కొనసాగించాలని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు సూచించారు. అయినా కానీ వారి మాట లెక్క చేయడంలేదు జగన్. చిత్తూరు జిల్లాలో తన యాత్రను యధావిధిగా కొనసాగిస్తున్నారు ఆయన. జగన్ వైఖరిపై అటు కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు.
డాక్టర్లు వద్దంటున్నా మాట వినకుండా ....
విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలిసి వున్నా యాత్ర కు బ్రేక్ వేయకుండా తమ అధినేత సాగిపోవడం పై ఆవేదన చెందుతున్నాయి పార్టీ వర్గాలు. కొద్దిరోజుల క్రీతం కూడా పాదయాత్రలో జగన్ అస్వస్థతకు గురయ్యారు. రోడ్లపై దుమ్ము ధూళీ తో వైరల్ ఫీవర్ కి గురయ్యారు. అలాగే కాళ్లకు బొబ్బలు వచ్చినా డాక్టర్ల మాట లెక్కచేయడం లేదు వైసిపి అధినేత. యాత్ర ప్రారంభంలో వెన్ను నొప్పి సైతం జగన్ ను వెంటాడింది. మొత్తానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన యాత్ర అనుకున్న సమయానికి పూర్తి చేయాలనీ జగన్ మొండిగా సాగిపోతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే మొండిగా తన యాత్ర సాగించి మండుటెండల్లో తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో సొమ్మసిల్లి పడిపోయారు. వైఎస్ తిరిగి కోలుకుని తన యాత్ర కొనసాగించడానికి దాదాపు 10 రోజులు సమయం పట్టింది. వయస్సు రీత్యా జగన్ తండ్రితో పోలిస్తే యువకుడే అయినా తండ్రి లానే మొండి పట్టుదలతో సాగడం వైసిపి శ్రేణులకు ఒకవైపు సంతోషాన్ని మరోవైపు ఆందోళనను కలిగిస్తుంది.