మెట్రో భద్రత ఒక్క కొలిక్కి వచ్చింది. సెక్యూరిటిని తామే చూసుకుంటామని చెప్పిన మెట్రో కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రయివేట్ సెక్యూరిటి చేతిలో ప్రతిష్మాతికమైన ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేకుండా పొయింది. తర్జన భర్జన లు పడిన తరువాత మెట్రో సెక్యూరిటిని సిటి పోలీసులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మెట్రో ప్రారంభం కాబోతోంది.
తామే చేపడతామన్న.....
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా చేపట్టిన మెట్రో ప్రాజెక్టు భద్రతపైన మల్లగుల్లాలు పడ్డారు.. ఒక వైపు మెట్రో ప్రాజెక్టు సిద్ధమైంది. కాని సెక్యూరిటి విషయం గురించి అధికారులు ఎటూ తెల్చలేదు. మరొక వైపు మెట్రో భద్రతను తామే చూసుకుంటామని చెప్పింది. అయితే ప్రభుత్వం మాత్రం సెక్యూరిటిని మెట్రో యాజమాన్యంకు అప్పగించేందుకు ససేమీరా అంది. చివరకు మెట్రో సెక్యూరిటి కొరకు ప్రత్యేకమైన ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ప్రస్తుతానికి ఎస్ పిఎస్ ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ట్రైయినింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.అయితే ఈ ఫోర్స్ అందుబాటులోకి రావడానికి చాల సమయం పడుతుంది.. సిబ్బందికి ట్రైయినింగ్ ఇవ్వడానికి కొంతసమయం పడుతుందని అధికారులు భావించారు.
ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో...
ఇదిలా వుంటే మెట్రో యాజమాన్యం తానే ప్రయివేట్ సెక్యూరిటితో నడుపుకుంటాననితేల్చి చెప్పింది. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అంది ..అంతేగాకుండా పోలీసులకు ఇవ్వాల్సిన రాయల్టీ పూర్తిగా మిగిలిపోతుందని మెట్రో యాజమాన్యం అనుకుంది..అయితే ఇందుకుప్రభుత్వం ఒప్పకోలేదు.. సరికదా.. మెట్రోకు ప్రయివేట్ సెక్యూరిటీ అవసరం లేదని. ఎదైనా క్రైమ్ జరిగితే మళ్లీ పోలీసులే రంగ ప్రవేశం^చేయాల్సి వుంటుందని... అందువల్ల.. పోలీసు ఫోర్స్ నే ముఖ్యమని చెప్పింది. దీంతో మెట్రో సెక్యూరిటి మల్ల గుల్లాలు పడిన తరువాత చివరకు ఒక్క నిర్ణయానికి వచ్చారు. ఇదిలా వుంటే ప్రత్యేక ఫోర్స్ రావాలంటే చాల సమయం పడుతుంది. అప్పటి వరకూ మూడు కమిషనరేట్ల పరిధిలోని మెట్రో స్టేషన్ లను శాంతి^భద్రతల అధికారులు పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా ఒక ఎస్ పి స్థాయి అధికారి ఆ మెట్రో సెక్యూరిటిని పర్యవేక్షిస్తారని ఉన్నతాధికారులు చెప్పారు. మూడు కమిషనరేట్లు పరిధిలోని మెట్రో సెష్టన్ల సెక్యూరిటీపి చూస్తారని పోలీసులు తెలిపారు.