మెంటలోడు అన్నంత పనీ చేసేటట్లు ఉన్నాడు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ యద్ధానికి కాలు దువ్వుతున్నాడు. అన్ని సన్నద్ధాలు చేసుకుంటున్నాడు. అమెరికా లక్ష్యంగా దాడులకు తెగబడేటట్లు సూచనలు కన్పిస్తున్నాయి. ఇందుకోసం కిమ్ పెద్దయెత్తున మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నారు. కొన్ని నగరాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరకొరియాలోని ప్రధాన నగరాల్లో రాత్రి వేళ్లలో లైట్లను ఆపి వేయిస్తున్నారు. అమెరికా సయితం అణుయుద్ధానికి రెడీ అవుతుందని కిమ్ ఉత్తర కొరియా మొత్తం చాటింపు వేయిస్తున్నారు. అణు యుద్దానికే కిమ్ సన్నాహాలు ప్రారంభించారు.
యుద్ధానికి సన్నాహాలు....
రెండో కొరియన్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కిమ్ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. గత కొంతకాలంగా ఉత్తరకొరియా, అమెరికా దేశాధ్యక్షుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. అమెరికాకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్న కిమ్ సైనికాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని వివరించారు. యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లే కనపడుతుంది. అయితే ఇలాంటి మాక్ డ్రిల్స్ గతంలోనూ కిమ్ చేశారంటున్నారు కొందరు. 2003లో ఇలాంటి కసరత్తులు చేసిన ఉత్తర కొరియా తర్వాత ఆ ఆలోచనను విరమించుకుంది. మరి ఈసారి కిమ్ కొంపముంచేటట్లే కన్పిస్తుంది. మరో వైపు కిమ్ ఆటలు కట్టించేందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉంది. ఉత్తర కొరియా కనుక అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఆసియా దేశాలన్నీ ఏకం కావాలని అమెరికా రక్షణ నిపుణులు ఇప్పటికే పలు దేశాలను కోరారు.