అసెంబ్లీలో కాపులకు రిజర్వేషన్లు బిల్లు తీర్మానం పెట్టి కేంద్రంపై నెట్టేసింది టిడిపి సర్కార్. ఆ అస్త్రాన్ని అర్ధం చేసుకున్న బిజెపి సర్కార్ ఇవి సుప్రీం గైడ్ లైన్స్ అంటూ తిరిగి బాల్ బాబు సర్కార్ కె విసిరింది. కాపు లకు రిజర్వేషన్ల అంశం పూర్తిగా అమలుకానీ పక్షంలో తిరిగి ఉద్యమం మొదలు పెడతా అని ఇప్పటికే ముద్రగడ ప్రకటించారు. అనుకున్నట్లే మార్చి నెల వచ్చేసింది. దాంతో ఇప్పుడు తిరిగి ఉద్యమ వ్యూహాలకు పదును పెడుతున్నారు మాజీ ఎంపీ పద్మనాభం.
ఇలా చేస్తే ఒకే ...
కేంద్రం మీదకు నెపం నెట్టకుండా న్యాయకోవిదులు అభిప్రాయాలను ముద్రగడ సేకరించారు. రాష్ట్రపతి ఆమోదముద్ర అన్నది ఇప్పట్లో అయ్యే పని కాదన్నారు పద్మనాభం. అందుకే దీనికో కొత్త సూచనను సీఎం కి చేశారు ముద్రగడ. ఇప్పుడైనా గవర్నర్ నరసింహన్ చేత ఆమోదముద్ర వేయిస్తే విద్య ఉద్యోగాల్లో కాపు రిజర్వేషన్లు అమలు అవుతాయని కనీసం అదైనా చంద్రబాబు సర్కార్ అమలు జరిగేలా దృష్టి పెట్టాలని కోరారు ముద్రగడ. తక్షణం రిజర్వేషన్ల పై ఆయన చర్యలు చేపట్టని పక్షంలో తిరిగి ఉద్యమంలోకి దిగుతామని హెచ్చరించారు ముద్రగడ. .