ముద్రగడ కిరి కిరి ఉంటుందా ...?

Update: 2017-12-02 06:30 GMT

కాపు రిజర్వేషన్ ల అంశానికి ఎట్టకేలకు పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేశారు. ఐదు శాతం విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మొత్తానికి రిజర్వేషన్ ప్రకటించారు. తదుపరి అసెంబ్లీ తీర్మానం తరువాత కేంద్రానికి ఈ అంశం చేరుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ 9 వ షెడ్యూల్ ను సవరిస్తే కానీ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లుబాటు కానీ పరిస్థితి. కాపు రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయి ఉద్యమం కొనసాగించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అన్నది చర్చనీయాంశం అయ్యింది.

ఎబిసిడీల వివాదమే నడుస్తుందా ...?

బిసిలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్ అమలు చేయడం కత్తిమీద సామే అవుతుంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొత్త రాజకీయం మొదలు పెడతారని అంటున్నారు. డిసెంబర్ 6వ తేదీ డెడ్ లైన్ గా ముద్రగడ ప్రకటించిన పరిస్థితి ల్లో మంజునాథ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం ఆ వెంటనే కేబినెట్ తీర్మానం, అసెంబ్లీలో సైతం ఏకగ్రీవ తీర్మానం కేంద్రానికి పంపడం జరగనున్నాయి. ఇవన్నీ బానే వున్నా రిజర్వేషన్లు కాపులకు అమలైతే మైలేజ్ ఎవరికి దక్కాలన్న అంశంలో ముద్రగడ, చంద్రబాబు టీం నడుమ మళ్ళీ మరో ఫైట్ తప్పక పోవొచ్చని అంటున్నారు. ఇప్పటికే బాబు వల్లే ఇది జరిగిందని తమ్ముళ్లు సంబరాలు పెద్ద ఎత్తునే చేపట్టారు. కాపు మంత్రులు మరో అడుగు ముందుకేశారు. గంటా శ్రీనివాస రావు, నారాయణ , చినరాజప్ప బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ముద్రగడను హోమ్ మంత్రి అయితే తీసి పడేసినట్లే మాట్లాడారు. దాంతో ఇప్పుడు ముద్రగడ వర్గాన్ని బాబు టీం గిల్లడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాలి.

Similar News