మిస్ వరల్డ్ కిరీటం భారత్ కే దక్కింది. హర్యానాకు చెందిన 20 ఏళ్ళ వైద్య విద్యార్థి మానుషి చిల్లార్ ఈ కిరీటాన్ని సాధించి అందాల సుందరీలకు భారత్ లో కొదవలేదని మరోసారి చాటి చెప్పింది. చైనా లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల సుందరాంగిణులు నువ్వా నేనా అని అందాలు, తెలివితేటలు కలబోసి ప్రదర్శించారు. చివరికి మానుషి కే అదృష్టం కిరీటం రూపంలో వరించింది. 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం భారత్ కు దక్కింది.
మానుషి కూచిపూడి డాన్సర్ వైద్య విద్యార్థి....
ప్రపంచ సుందరి కావాలని మానుషి కలలు కంది. అలా కలలు కని ఆమె వదిలిపెట్టలేదు వాటిని సాకారం చేసుకునేందుకు ఆహోరాత్రుళ్ళు తపస్సు చేసింది. ఫలితం సాధించింది. కూచిపూడి నృత్యాన్ని రాజారాధారెడ్డి దగ్గర ఔపోసన పట్టింది. ఢిల్లీ లో వైద్య విద్య చేస్తూ చదువులోనూ రాణిస్తుంది. ఇలా బహుముఖ ప్రజ్ఞతో అంతర్జాతీయ యవనికపై ఆత్మవిశ్వసంతో సగర్వంగా తన సత్తా చాటి మహిళలకు మానుషి స్ఫూర్తిగా నిలిచింది