ఇక నుంచి స్వేచ్ఛగా తాగేయండి మీ ఇష్టం. మగాళ్ల కన్నా మీరు ఏమి తక్కువ. వారు చేసే ఎంటర్ టైన్ మెంట్ మీకు కల్పిస్తున్నాం... పెగ్గేసి చిందేయమంది ప్రభుత్వం. అనేక దశాబ్దాలుగా దేశంలో లింగ వివక్ష మద్యం విషయంలో సాగడం దుర్మార్గమంది. ఇలా అంటూ తమ దేశంలోని 1974 చట్టాన్ని సవరించింది. ఆ చట్టం మహిళలకు మద్యం విక్రయించడాన్ని అడ్డు చెప్పడంతో దానికి గుడ్ బై కొట్టింది. ఇలా ప్రకటన చేసి మూడు నాలుగు రోజులైందో లేదో వెంటనే దేశమంతా ఆందోళన మొదలైంది.
నిరసనలతో వెనక్కు తగ్గిన....
బౌద్ధమతాన్ని అత్యధికులు నమ్ముకున్న దేశంలో ఈ బాగోతం ఏమిటంటూ నిరసనలు మొదలు అయ్యాయి. దాంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఇచ్చేశాం మహిళలకు స్వేచ్ఛ అన్న ప్రభుత్వ నోటి నుంచే తమ వరాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాలిసి వచ్చింది. తిరిగి తమ దేశ చట్టం 74 ప్రకారం లేడీస్ నో డ్రింక్ సిస్టం అమల్లోకి వచ్చేసినట్లు చెప్పేసింది. ఇంతకీ ఆ దేశం మన పక్కనే వున్న శ్రీలంకే. శ్రీలంకలో 1974 చట్టాన్ని సవరించడం వివాదాస్పదమయింది. హిందూ దేశంగా ముద్రపడిన అక్కడ పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది.