మరోసారి బతికి బట్టకట్టిన సీఎం ...

Update: 2017-12-10 03:30 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. నాసిక్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని ముంబాయి బయల్దేరిన ఆయన ఛాపర్ పదిఅడుగులు పైకి లేచి అకస్మాత్తుగా కిందకి దిగింది. ఈ సంఘటన అక్కడ అధికారులను పరుగులు పెట్టించింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో గాల్లో కుప్పకూలాలిసిన హెలికాఫ్టర్ సురక్షితంగా నెలకు దిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే ఫడ్నవీస్ తో బాటు వంటవాడు, భారీ వంట సామాగ్రి రైలు బస్సుల్లో సర్ధేసినట్లు ఛాపర్ లో పెట్టేయడంతో అధికబరువుతో పైకి లేవడానికి హెలికాఫ్టర్ అవస్థ పడింది. ఇది గమనించిన పైలట్ ప్రమాదాన్ని ముందే ఊహించి కిందకు దించేశారు. ఆ వెంటనే వంటవాడిని సామాగ్రిని రోడ్డు మార్గంలో అధికారులు పంపించి ముఖ్యమంత్రిని అదే ఛాపర్ లో సాగనంపారు.

గతంలో కూడా ప్రమాదాలనుంచి ....

మహారాష్ట్ర సీఎం గతంలో కూడా రెండు సార్లు హెలికాఫ్టర్ ప్రమాదాలనుంచి ప్రాణాలు దక్కించుకున్నారు. ఐదు నెలలక్రితం ఆలీబాగ్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఛాపర్ కుప్పకూలింది. తక్కువ ఎత్తులో ఛాపర్ కూలడంతో గాయాలతో ఆయన బతికి బట్టకట్టారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం నుంచే బయటపడ్డారు. ఫడ్నవీస్ కి వరుసగా ఎదురౌతున్న ఈ సంఘటనలతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ప్రమాదాల నుంచి ఆయన సురక్షితంగా బయటపడుతున్నందుకు మరోపక్క ఆనంద పడుతున్నారు.

Similar News