మరోసారి దంచికొట్టారు

Update: 2018-03-13 02:07 GMT

శ్రీలంక టూర్ లో యువ క్రికెటర్లు తమ ప్రతిభకు సానపడుతున్నారు. తాజాగా జరిగిన టీట్వంటీ లో భారత్ తన ఆధిపత్యాన్ని మరో విజయంతో సగర్వంగా చాటిచెప్పింది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు భారత బౌలింగ్ ధాటికి 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే సాధించారు. టీమ్ ఇండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంకేయుల వెన్ను విరకొట్టాడు. దాంతో భారీ లక్ష్యాన్ని భారత్ ముందు పెట్టలేక పోయింది శ్రీలంక.

సమిష్టి రాణింపుతో దక్కిన విజయం ...

153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (11) మరోసారి విఫలం కాగా, సూపర్ ఫామ్ లో వున్న శిఖర్ ధావన్ (8) తొందరగా పెవిలియన్ చేరుకున్నా కుర్ర టీం ఖంగారు పడలేదు. లోకేష్ రాహుల్ (18) సురేష్ రైనా (27) లు వికెట్ల పతనం అడ్డుకుంటే, రాహుల్ తరువాత వచ్చిన మనీష్ పాండే 48 పరుగులతో నాట్ అవుట్ గా నిలవగా, దినేష్ కార్తిక్ 39 పరుగులతో నాట్ అవుట్ గా నిలబడి జట్టును విజయతీరానికి చేర్చారు. ఇక లంకేయుల బౌలింగ్ లో ధనుంజయ్ 2, ప్రదీప్ జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించిన టీం ఇండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Similar News