మరో వివాదానికి తెరతీసిన విలక్షణ నటుడు ...!

Update: 2017-12-12 03:30 GMT

ఆమధ్య ప్రధాని నరేంద్ర మోడీని పలు సందర్భాల్లో టార్గెట్ చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో వివాదం సృష్ట్టించారు. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశంలో స్వేచ్ఛగా బతికే ప్రాంతం కేరళ మాత్రమే అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు మొదలైపోయాయి. ఇటీవలే బెంగుళూరు లో గౌరీ లంకేష్ హత్యపై తీవ్రంగా స్పందించిన ప్రకాష్ రాజ్ ఆ తరువాత గోరక్షణ సమితి దాడులపైనా, హిందుత్వ అంశాలపై పలు వేదికలపై కేంద్రాన్ని కడిగేశారు. నేరుగా ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ సంచలనమే అయ్యారు.

ఇక్కడ విలక్షణమే ...

ఇప్పుడు కేరళలో అంతర్జాతీయ చలన చిత్ర వేదిక సంబరాలకు హాజరైన ప్రకాష్ రాజ్ లెఫ్ట్ ప్రభుత్వంలో పౌరులకు లభిస్తున్న స్వేచ్ఛ మిగతా దేశంలో ఎక్కడుందని ప్రశ్నలు వేశారు. తాను స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించాలని అనుకుంటానని ఇక్కడే అది లభించిందన్నారు. గత కొంతకాలంగా ప్రధాని మోడీ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ని సూచిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రానికి ముందు సమాజంపై తనకున్న అవగాహన ఆయన జనంలోకి తెచ్చే ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కి వున్న ఇమేజ్ క్రేజ్ వేరు. ఆయన ఏమి చేసినా వార్తల్లో వుండే వ్యక్తే. చిత్రసీమలో ఏ క్యారెక్టర్ అయినా అలవోకగా ఆ పాత్రలో ఒదిగిపోయే నైజం ఆయన సొంతం. కులాలు మాటాలకు అతీతంగా కూడా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వున్నారు. అలాంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని వర్గాలను హీట్ ఎక్కిస్తున్నాయి. కేరళలో ఆర్ ఆర్ ఎస్ పై జరుగుతున్న హత్యా రాజకీయాలు ఆయనకు ఎందుకు కనపడటం లేదని ప్రశ్నలు సంధింస్తున్నారు హిందుత్వ అభిమానులు. మొత్తానికి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను తాను విలక్షణంగానే ఉంటానని ప్రకాష్ రాజ్ నిరూపించారు.

Similar News