మధ్యప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం ...!

Update: 2017-11-27 03:30 GMT

అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి ? ఎలాంటి శిక్షలకు కీచకులకు వేస్తే మహిళలకు రక్షణ లభిస్తుంది ? అభం శుభం తెలియని పసిమొగ్గలపై అమానుషాలు ఇంకా ఎన్నేళ్లు ? ఎన్నాళ్ళు ? అని భావించింది మధ్యప్రదేశ్ క్యాబినెట్. అందుకే సంచలన నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అదే 12 ఏళ్ళ లోపు బాలికల పై అత్యాచారం చేసే వారికి మరణదండనే శరణ్యమని భావించింది. ఆ మేరకు చట్టం తేవాలనే ప్రయత్నంలో వుంది.

సమాజంలో పెరిగిపోతున్న అరాచకాలు ....

ప్రస్తుతం దేశంలో నేరం చేస్తే విధించే శిక్షలు మహాత్మా గాంధీ ప్రవేశపెట్టమన్న సంస్కరణ సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి ప్రకారం ఈ శిక్షలు అమలు అవుతాయి. ఇండియన్ పీనల్ కోడ్ మార్పు చేయాలంటే పార్లమెంట్ లో ప్రయత్నం జరిగితేనే సాధ్యం అవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంత చట్టాలు నేరస్థులపై శిక్షల అమల్లో తీసుకొచ్చే వెసులుబాటు రాజ్యాంగం కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటేనే ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే వివిధ అరుదైన సంఘటనల్లో నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష కొన్ని సందర్భాల్లో విధిస్తున్నారు. ఇప్పటికే డెత్ సెంటెన్స్ ఎత్తివేయాలంటూ దేశంలో ప్రజా సంఘాలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ సిఫార్స్ అసెంబ్లీ లో చర్చ జరిపి పంపే తీర్మానం కీలకం అవుతుంది. కేంద్రంలో కూడా బిజెపి ప్రభుత్వమే ఉన్నందున మరి మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News