సైబర్ నేరాలు కొత్త పుంతాలు తొక్కుతున్నాయి ..కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కొత్త తరహా నేరాలను చూసి పోలీసులే విస్తుపొతున్న వైనమిది. మందులతో రొగాలు తగ్గుతాయి. ఇది ప్రతిఒక్కరికి తెలుసు .. ప్రజల వీక్ నెస్ నే ఆసరాగా తీసుకుని మందుల పెరుతో మోసాలు చేస్తున్న తీరు ఇది. ప్రముఖ మందుల వెబ్ సైట్స్ ను హ్యాక్ చేసి డబ్బులు దండుకుంటున్న నైజీరియన్ ముఠా ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాలు నానాటికి పెరిగి పొతున్నాయి. కొత్త కొత్త తరహాలో జరుగుతున్న ఈ నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు సైతం తంటాలు పడాల్సిన పరిస్దితి. అంతేగాకుండా ఇలాంటి నేరాలు కూడా జరుగుతాయని విస్తుపొతున్నారు. ఇద్దరు నైజీరియన్లులతో పాటుగా నలుగురు ఇండియన్లు కలిసి భారీ మోసం చేశారు. మన దేశంలో ఆరోగ్యం సంగతి ఎలా వున్నా ప్రతి ఒక్కరూ మందుల మింగుతునే వుంటారు.దీన్ని అవకాశంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు.
కిలాడి గ్యాంగ్....
ప్రముఖ హాస్పిటల్స్ అన్ని కూడా తమ సొంత ఫార్మాసీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆన్ లైన్ ద్వారా విక్రయాలను కూడా చేస్తుంటాయి.. దీనినే సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకున్నారు. ఢిల్లీలో మకాం వేసిన ఇద్దరు నైజీరియన్లు .. అపోలో లాంటి వెబ్ సైట్స్ ను హ్యాక్ చేశారు. అత్యంత విలువైన మందులను ఎవరైనా ఆర్డర్ చేయడంతోనే వీరికి సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అపోలో తో పాటుగా ప్రముఖ ఫార్మసి కంపెనీల వెబ్ సైట్స్ ను ఇద్దరు కలిసి హ్యాక్ చేశారని పోలీసులు చెప్పారు. ఇదిలా వుంటే ఇప్పటి వరకు35 ఫార్మసి కంపెనీలకు చెందిన వెబ్ సైట్స్ హ్యాక్ చేసి సాధారణ ప్రజల ను మోసం చేస్తున్నారు. ప్రధానంగా మందులను ఇంటికి డెలివరీ ఇస్తామని చెప్పి డ్రెబిట్ అండ్ క్రెడిట్ కార్డుల వివరాలను తీసుకుంటున్నారు..ఇలా తీసుకున్న వివరాలతో కార్డుల్లో ఉన్న డబ్బులను కొల్గగొట్టుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా వుంటే ఫార్మసి కంపెనీలకు చెందిన వెబ్ సైట్స్ లో మందులను ఆర్డర్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని పోలీసులు అంటున్నారు.