మందుకొట్టి ఖరీదైన కార్లలో గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి....?

Update: 2018-01-25 03:56 GMT

మందుకొట్టి ఖరీదైన కార్లలో గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి కార్లలో షికార్లు కొడుతూ హైదరాబాద్ పోలీసులకు చిక్కారు మందుబాబులు.. అర్థరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్.ఆర్. నగర్, బేగంపేట్ ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో తాగుబోతు విద్యార్థిని జ్ఞాపిక ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. యువతి జ్ఞాపికకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 104 పర్సంటేజ్ గా రికార్డైంది. దాంతో యువతి జ్ఞాపికపై కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. విద్యాసంస్థల్ని నిర్వహించే సుమన్ వర్మ మద్యంతాగిన మైకంలో ల్యాండ్ రోవర్ కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఐదు ప్రాంతాల్లో జరిగిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 48 మందిపై కేసులు నమోదు చేసి.. వారి నుంచి 44 కార్లు, 4 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారందరికీ బేగంపేట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించాక.. నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Similar News