భూమా ఫ్యామిలీ అందరికంటే అట్టడుగున...?

Update: 2017-11-04 12:30 GMT

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భూమా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు డి గ్రేడు కంటే తక్కువ సాధించడంపై అధినేత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఈ ఏడాది సెప్టంబరు 2వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి పదిహేను రోజులకొకసారి చంద్రబాబు వీటిపై సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల నియోజకవర్గంలో పార్టీ వెనకబడి ఉండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు.

డి గ్రేడు కంటే తక్కువలో.....

ప్రజలకు చేరువ కావాలని భావించి ఏర్పాటు చేసిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మంత్రి అఖిలప్రియ, ఇటీవలే గెలుపొందిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సీరియస్ గా తీసుకోకపోవడాన్ని పార్టీ అధిష్టానం తప్పు పడుతుంది. కర్నూలు నియోజకవర్గంలో ఈ రెండు నియోజకవర్గాలు అన్నింటికంటే వెనకబడి ఉండటంపై ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులును చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. చంద్రబాబుకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ 70254 ప్రజాసమస్యలను స్వీకరించి ఎ గ్రేడు సాధించింది. ఇక బి గ్రేడులో ఆలూరు 60,700 సమస్యలతో రెండో స్థానంలో ఉంది. సి గ్రేడ్ లో కోడుమూరు నియోజకవర్గం దక్కించుకుంది. డి గ్రేడులో పాణ్యం నియోజకవర్గం ఉంది. ఇక మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గం 52,994, 44194 సమస్యలను స్వీకరించి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గం డి గ్రేడు కంటే కింద ఉండటం విశేషం. దీనిపై అధిష్టానం సీరియస్ గా ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ త్వరలోనే ఆళ్లగడ్డ నియోజకర్గంలో పాదయాత్ర చేయనుండటంతో సీరియస్ గా పార్టీ పనులు చేపట్టాలని హైకమాండ్ అఖిలప్రియకు సూచించినట్లు తెలుస్తోంది.

Similar News