భార్యను వదిలేస్తే ప్రధాని కావొచ్చా ...!

Update: 2017-12-31 06:30 GMT

త్రిబుల్ తలాక్ పై కొత్త చట్టానికి లోక్ సభ ఆమోదం తెలపడం ఎలా వున్నా దీనిపై రచ్చ మాత్రం కొనసాగుతుంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ చాందిని చౌక్ ఎమ్యెల్యే అల్కా లాంబా ట్వీట్ ఇప్పడు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. త్రిబుల్ తలాక్ చెబితే జైలుకు వెళ్లేలా చట్టం రూపొందిన వైనంపై అల్కా వ్యగ్యంగా ప్రధానిని ఉద్దేశించి తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎందుకు అనవసరంగా తలాక్ చెప్పడం జైలుకి పోవడం, ఏది చెప్పకుండా భార్యను వదిలేసి పోతే దేశానికి ప్రధాని కావొచ్చంటూ మోడీ వైవాహిక జీవితంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై మోడీ వ్యతిరేకులు ఆమెకు మద్దత్తుగా నిలవగా బిజెపి మోడీ అభిమానులు అల్కా కామెంట్స్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మోడీ భార్యను వదిలేయడానికి కారణాలు తెలియకుండా ఆయన వ్యక్తిగత జీవితంపై అల్కా కామెంట్ చేయడం దారుణమంటూ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.

బహుభార్యత్వాన్ని రద్దు చేయండంటున్న ముస్లిం మహిళలు ...

త్రిబుల్ తలాక్ చట్టం తేవడం తో ముస్లిం మహిళ ల జీవితాలు వెలుగులతో నిండిపోవని అంటున్నాయి పలు మహిళా సంఘాలు. ముస్లిం లలో బహుభార్యత్వం రద్దు చేసే చట్టం తెస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది వారి వాదన. ఒక భార్య తో జీవనం సాగించడమే దుర్భరంగా మారిన నేటి పరిస్థితుల్లో పేద , మధ్యతరగతి కి చెందిన ముస్లిం కుటుంబాల్లో బహుభార్యత్వం ఆర్ధిక స్థితిని తల్లకిందులు చేస్తుందని మోడీ సర్కార్ ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ముస్లిం మహిళలు కోరుకుంటున్నారు.

రాజ్యసభలో కాంగ్రెస్ పోరాట పంధా ...

తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదించకుండా లోక్ సభలో త్రిబుల్ తలాక్ పై కేంద్రం బిల్లు ఆమోదం పొందేలా వ్యవహారం నడిపించడాన్ని కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా చేసింది. ఇదే ధోరణి రాజ్యసభలో కొనసాగిస్తే మైనారిటీలకు తమ పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ లో ఆందోళన పెరిగింది. దాంతో బిల్లు ఆమోదం కోసం రాజ్యసభ కు వచ్చినప్పుడు నానా రచ్చా చర్చ ద్వారా చేయాలన్నది పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహం. సవరణలు చేర్చకపోతే రాజ్యసభలో విపక్షాల బలంతో బిల్లును తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే పార్టీ వైఖరి వెల్లడించిన వైనం రాహుల్ ఎత్తుగడకు అద్దం పట్టింది. మొత్తానికి బిజెపి సర్కార్ మొదలు పెట్టిన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇప్పడు అన్నిపార్టీల కొంప ముంచేలాగే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు

Similar News