బ్రేకింగ్ : సెకన్లలో వాయిదా పడిన లోక్ సభ

Update: 2018-03-19 05:45 GMT

లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ఏపీకి విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ప్లకార్డులను పట్టుకుని వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభను లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ, వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి. సభ ప్రారంభమైన 30 సెకన్లకే వాయిదా పడింది.

రాజ్యసభ రేపటికి వాయిదా....

ఇక రాజ్యసభలో కూడా అదే గందరగోళం జరుగుతోంది. కాని టీడీపీ, వైసీపీ సభ్యులు నినాదాలతో ఛైర్మన్ పోడియం చుట్టుముట్టడంతో వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభను కూడా మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

Similar News