శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యతతో దూసుకెళుతున్నారు. ప్రత్యర్థికంటే దాదాపు ఐదు వేల ఓట్లు ముందంజలో ఉన్నారు. దినకరన్ కు భారీ ఆధిక్యత లభిస్తుండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కౌంటింగ్ కేంద్రంలోనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో కౌంటింగ్ ను కొద్దిసేపు నిలిపి వేశారు. అయితే ఆందోళన చేస్తున్న రెండు వర్గాలను పోలీసులు బయటకు పంపి తిరిగి కౌంటింగ్ ను ప్రారంభించారు. దాదాపు 15 నిమిషాల పాటు కౌంటింగ్ నిలిపివేసిన అధికారులు తిరిగి ప్రారంభించారు. అయితే దినకరన్ ఇంటివద్ద ఆయన అనుచరులు బాణా సంచా ను కాల్చి సంబరాలు చేసుకున్నారు. మెజారిటీ దిశగా దినకరన్ దూసుకుపోతున్నారు. కౌంటింగ్ తిరిగి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. దినకరన్ కు 10421 ఓట్లు, డీఎంకేకు 2383 ఓట్లు, అన్నాడీఎంకేకు 4521 ఓట్లు లభించాయి.