వైసీపీ వ్యూహం మార్చుకుంది. రేపే లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది. అన్ని పార్టీల మద్దతు కోరుతూ లేఖ రాయాలని నిశ్చయించింది. టీడీపీ మద్దతు కోరుతూ ఆ పార్టీకికూడా లేఖలు రాయనుంది. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం త్వరగా ముగించాలని నిర్ణయించిందని తెలియడంతో జగన్ వ్యూహం మార్చారు. మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టాలని తొలుత భావించారు. అయితే రేపే పెట్టాలని వ్యూహం మార్చారు. రాజీనామాలను కూడా ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ 6వ తేదీ కాకుండా ముందుగానే చేసేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.