బ్రేకింగ్ : వైసీపీలోకి మరో బెజవాడ టీడీపీ లీడర్

Update: 2018-03-30 12:23 GMT

బెజవాడలో కీలకనేత వైసీపీలో చేరుతున్నారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకోగానే టీడీపీ నేత యలమంచలి రవి జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొడాలి నాని, వంగవీటి రాధాలతో యలమంచలి రవి చర్చించినట్లు తెలుస్తోంది. యలమంచలి రవి చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చేనెలలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినుంది. ఆ సమయంలో యలమంచలి రవి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో యలమంచలి రవి చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Similar News