బ్రేకింగ్ : వైసీపీ విజయం

Update: 2017-10-28 05:55 GMT

వైసీపీ విజయం సాధించింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా వైసీపీకి చెందిన రాజగోపాల్ ఎన్నికయ్యారు. జగ్గయ్య పేట మున్సిపాలిటీలో వైసీపీకి 16 మంది సభ్యుల బలం ఉంది. మొత్తం 28 సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో టీడీపీకి మెజారిటీకి తగ్గ బలం లేదు. టీడీపీకి కోఆప్షన్ సభ్యులతో కలిపి 11 మంది మాత్రమే ఉన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిన్ననే జరగాల్సి ఉండగా టీడీపీ ఎన్నిక వాయిదా వేయాలంటూ గందరగోళం సృష్టించింది. తమ సభ్యులను వైసీపీ కిడ్నాప్ చేసిందని ఆరోపణ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని జగ్గయ్యపేటకు వచ్చి మరీ ఈ ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ఎన్నికల అధికారి నిన్న వాయిదా వేసిన ఎన్నికను ఈరోజు నిర్వహించారు. టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో వైసీపీకి చెందిన రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Similar News