బ్రేకింగ్ : వైసీపీ యూటర్న్...?

Update: 2017-12-26 03:38 GMT

కర్నూలు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీలో హైడ్రామా నడుస్తోంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని నిన్న వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అభ్యర్థిత్వాన్ని చూసిన వైసీపీ నేతలు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ టిక్కెట్ శివానందరెడ్డికి దక్కుతుందనుకున్నారు. కాని శివానందరెడ్డికి కాకుండా కేఈ ప్రభాకర్ కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీ నేత గౌరు వెంకటరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. గౌరు వెంకటరెడ్డికి శివానందరెడ్డి బంధువు. ఆయనకు టిక్కెట్ ఇస్తే తాను పోటీలో ఉండకూడదనుకున్నారు. కాని కేఈకి టిక్కెట్ ఇవ్వడంతో ఇప్పుడు గౌరు పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. ఈరోజు నామినేషన్ కు ఆఖరి గడువు కావడంతో గౌరు వెంకటరెడ్డి హుటాహుటిన జగన్ పాదయాత్ర చేస్తున్న అనంతపురం జిల్లా గాండ్లపెంట చేరుకున్నారు. జగన్ ను ఒప్పించి తాను పోటీ చేస్తానని గౌరు చెబుతున్నారు. తనకు గెలిచే అవకాశాలున్నాయని గౌరు వెంకటరెడ్డి చెబుతున్నారు. జగన్ అంగీకరించినా.. అంగీకరించకపోయినా గౌరు వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి వైసీపీలో ఉంది.

Similar News